Sunday 30 September 2012

‘రెబల్’కి పావు గంట కోత... తీసేసిన సీన్స్ ఇవే



హైదరాబాద్ : ప్రభాస్ కెరీర్ లోనే హై బడ్జెట్ గా రెడీ అయి, మొన్న శుక్రవారం విడుదలైన చిత్రం ‘రెబల్'. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్పబడుతున్న ఈ చిత్రం రిలీజైన మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం లెంగ్త్ ఎక్కువై పోయిందంటూ అన్ని చోట్ల నుంచీ విమర్శలు వచ్చాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని దర్శక,నిర్మాతలు ఈ చిత్రంలో పావు గంట సేపు కోత పెట్టారు. అవి ఈ రోజు నుంచే అమలలులోకి వస్తాయి. ఆ సీన్స్ ఏమిటంటే...



1. సినిమా ప్రారంభంలో ప్రబాస్,బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్స్ 
2. కోవై సరళ స్విమ్ సూట్ సీక్వెన్స్, ఆమె డాన్స్ బిట్స్ 
3. ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎమ్.ఎస్ నారాయణ ఎపిసోడ్
4. ఫ్లాష్ బ్యాక్ అయ్యా తమన్నా, ప్రభాస్ మధ్యన వచ్చే కొన్ని సన్నివేశాలు
చిత్రం కథ ఏమిటంటే... రిషి(ప్రభాస్) తండ్రి రెబెల్ (కృష్ణ రాజు)ని అజ్ఢాత వ్యక్తులు చంపేస్తారు. వారి పేరు స్టీఫెన్ రాబర్ట్ అని తెలుస్తుంది. ఆ మాఫియా డాన్స్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. వారి ఎడ్రస్ ట్రేస్ చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా బ్యాంకాక్ వెళ్లి మరీ వారి అసెస్టెంట్ నాను కూతరు నందిని(తమన్నా)ని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తాడు. ఇంతకీ రిషి అంత డెస్పరేట్ గా స్టీఫెన్ రాబర్డ్ ని వెతికి చంపగలిగాడా..తన పగ ఎలా తీర్చుకున్నాడు... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్‌ పాత్రని లారెన్స్‌ తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాస్‌కి నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. యాక్షన్‌ ఘట్టాలు అబ్బురపరుస్తాయి''అన్నారు. . లారెన్స్ మాట్లాడుతూ...మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు. ఈ చిత్రంన విడుదల అవుతోంది. అలాగే ప్రభాస్‌ శైలికి సరిపోయే చిత్రమిది.‘రెబల్' అనేది టైటిల్ మాత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది.ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ‘ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా ‘రెబల్' ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది. అన్నారు.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...