Friday 27 April 2012

DHAMMU Full Movie Storey In Telugu

వాసిరెడ్డి వంశానికి... నాజర్ వంశానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి వాళ్లని వీళ్లు...వీళ్లని వాళ్లు నరుక్కుంటూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు చంపుకోకుండా సంక్రాంతి రోజు వేసేసుకుందాం అనే రూల్ పెట్టుకుంటారు. ఆ రోజు ఎవరు పైచేయి సాధిస్తే.... ఆ సంవత్సరం అంతా వాళ్లదే. ఈ క్రమంలో వాసిరెడ్డి వంశంలో మగాడు అనేవాడు లేకుండా చేస్తారు నాజర్ వర్గీయులు. ఒక వేళ మగపిల్లాడు పుట్టినా వెంటనే చంపేస్తారు.

ఈ క్రమంలో వాసిరెడ్డి వంశీయులైన సుమన్, భానుప్రియలకు మగ పిల్లాడు పుడతాడు. ఈ విషయం ప్రత్యర్థి వర్గానికి తెలిస్తే చంపేస్తారనే భయంతో చనిపోయి పుట్టాడని అబద్దం చెప్పి అందరినీ నమ్మిస్తారు. ఆ పిల్లాన్ని అక్కడి నుంచి తీసుకెళతారు. వాసిరెడ్డి వంశానికి చెందిన మగాళ్లంతా సుమన్ తో సహా నాజర్ వర్గీయులకు కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోతారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్.

మళ్లీ కథలోకి వస్తే... రామచంద్ర( జూ ఎన్టీఆర్) సిటీలో అనాదగా పెరుగుతాడు. 68 లక్షలు సంపాదించి వాటిని బ్యాంకులో వేసుకుని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆ డబ్బు మీద వచ్చే వడ్డీతో హాయిగా జీవితం గడిపేద్దామనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి సత్య(త్రిష) పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య లవ్వు మొదలువుతుంది.



వాసిరెడ్డి వంశానికి చెందిన పెద్దాయన వీరదుర్గం(కోట శ్రీనివాసరావు) తమ వంశంలోకి రామచంద్రను దత్తత తీసుకోవాలని పట్నం వస్తాడు. త్రిష కూడా తనను పెళ్లి చేసుకోవాలంటే నీకో కుటుంబం ఉండాలి. లేకుంటే మానాన్న ఒప్పుకోడు అని మొళిక పెడుతుంది. దీంతో దత్తత వెళ్లడానికి రామచంద్ర ఒప్పుకుంటాడు.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే......కోట, త్రిష, అలీ వీళ్లంతా అతన్ని ఆ వంశంలోకి దత్తత తీసుకెళ్లడానికి ముందస్తు ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తారు. వాళ్లు ఎన్టీఆర్‌ను మాత్రమే దత్తత తీసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏమిటి? వాసిరెడ్డి వంశీయుడు అయ్యాక హీరో ఏం చేశాడు? అనేది థియేటర్లో చూడాల్సిందే. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...